కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం
కాకినాడ రూరల్ మండలంలోని హార్బర్పేట సముద్రతీరం సినీ సందడితో కళకళలాడింది. మౌంటి ప్రొడక్షన్స్ పతాకంపై జాలర్ల జీవన కథాంశాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘గర్భసంద్రం’ చిత్రం షూటింగ్ కార్యక్రమం అక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత నీలిమ మాట్లాడుతూ జాలర్ల కుటుంబాల జీవన పోరాటం, సముద్రంతో వారి అనుబంధం, మాతృసెంటిమెంట్ ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రావణుడి లంకలో జరిగిన ఒక సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని కథను రూపొందించామని, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పూర్తిగా నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రంలో జాలర్ల జీవితాల్లోని వాస్తవ పరిస్థితులు, వారి కష్టసుఖాలు, కుటుంబ బంధాలు, తల్లి ప్రేమ గొప్పతనం ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ చిత్ర కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని, ప్రతి పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరణ జరుగుతోందన్నారు. కాకినాడ హార్బర్పేటతో పాటు...

Comments
Post a Comment