లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీసులు
కాకినాడ జిల్లా : కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ గారి పర్యవేక్షణలో, కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వన్‌టౌన్ సీఐ శ్రీ ఎం. నాగదుర్గారావు గారి ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, పేకాట, క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడం, అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం లక్ష్యంగా లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జీల్లో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, రిజిస్టర్లు, గుర్తింపు పత్రాలను పరిశీలించి నిబంధనల అమలును తనిఖీ చేశారు.లాడ్జి యజమానులు, నిర్వాహకులు ప్రతి అతిథి నుంచి ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో గుర్తింపు పత్రం తప్పనిసరిగా తీసుకున్న తర్వాతే గదులు కేటాయించాలని ఆదేశించారు. సందర్శకుల పూర్తి వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయడంతో పాటు వాటి కాపీలు ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ కి పంపాలని సూచించారు.అదేవిధంగా ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు లాడ్జీల్లో బస చేస్తున్నట్లు గుర్తించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112 అత్యవసర సేవలకు సమాచారం అందించాలని కోరారు.

Comments
Post a Comment