పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్న మాజీ సర్పంచ్ చీకట్ల వెంకటేష్
సామర్లకోట: స్వర్ణ పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్లో గ్రామ మాజీ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చీకట్ల వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రుల పాత్ర కీలకమని తెలిపారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ముసలయ్య, అనూసురి రాంబాబు, అమలాపురం దుర్గాప్రసాద్, కొప్పిశెట్టి సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment