రైతు బజార్‌లో రైతులకే చోటులేదా..? జేసీ ఎదుట రైతుల ఆవేదన

కాకినాడ జిల్లా ... కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్ బజారులో ఉన్న రైతులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారనీ గత 25 సంవత్సరాలుగా అదే రైతు బజార్లో రైతులు బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్'ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన రైతులు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్లో మాకినేని భాస్కర్ అనే వ్యక్తి రైతు బజార్ స్థలాన్ని ఆక్రమించుకుని షాపులు కట్టి రైతుబజార్లో ఉన్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అడిగితే తాము రైతులం కాదని ఇక్కడ వ్యాపారాలు చేయనీనని వైసీపీ నేత నక్కా కిషోర్ అనే వ్యక్తితో బెదిరిస్తున్నట్లు వాపోయారు. తామంతా రైతుల నేనని ఎప్పటికప్పుడు అద్దెలు చెల్లిస్తూ వ్యాపారులు చేసుకున్నప్పటికీ అతను తమపై దౌర్జన్యం చేస్తూ కేసులు పెడుతూ ఇబ్బందులు కురిచేస్తున్నారని తమకు న్యాయం చేయాలని రైతు కర్ని వీర్రాజు జనసేన నాయకులతో వచ్చి ఫిర్యాదు చేశారు. జనసేన నాయకులు చింతపల్లి బన్నీ మాట్లాడుతూ వ్యవసాయ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కలిసి కూటమి నాయకులకు అన్యాయం చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ వైస్ చైర్మన్ బడిగంటి దేవి మాట్లాడుతూ చైర్మన్'ను తాను వివరణ కోరగా ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా తనకు సమాధానం కూడా చెప్పలేదని అన్నారు. రైతు బజార్ రైతులకు సంబంధించిన విషయంలో రైతులకు అన్యాయం చేయడంలో టీడీపీ, వైసీపీ నాయకులు కలిసిపోయారనే అనుమానం కలుగుతోందని ఈ విషయంపై సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావుకు (కొండబాబు) ఫిర్యాదు చేసిన అంతగా స్పందించలేదని రైతులు వాపోయారు. జేసీని కలిసిన వారిలో కోడి శ్రీను, నీలపల్లి కామరాజు, కోరుకొండ కనకారావు, యల్ల సత్తిబాబు, గుండ్రం సతీష్ తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ