గైగోలుపాడులో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

కాకినాడ రూరల్ : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రమణయ్యపేట గ్రామపంచాయతీ పరిధిలోని గైగోలుపాడు లో గల శ్రీ సిద్ధి వినాయక శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి–సత్యనారాయణమూర్తి దంపతులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌బాబు కార్యాలయ ఇన్‌చార్జి, టీడీపీ సీనియర్ నాయకులు మేకా లక్ష్మణమూర్తి, జనసేన రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాటికాయల వీరబాబు, సానా సతీష్‌బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తదితరులు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. గైగలపాడు ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. సాయిబాబా ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పిల్లి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, పలువురు పెద్దలు, నాయకులు, భక్తుల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందిందన్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ గురుపౌర్ణమి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్లు చెప్పారు. గైగలపాడులో బీసీ కల్యాణ మండపం నిర్మించాలనే సంకల్పంతో స్థానిక నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని, నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సానా సతీష్‌బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గురుపౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తికి ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు, సానా సతీష్‌బాబు కార్యాలయ ఇన్‌చార్జి మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గైగలపాడులో బీసీ వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీసీ కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనితో పాటు సాయిబాబా సేవా ధ్యాన మందిరం, అదనపు షెడ్ నిర్మాణాలను కూడా చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతంలో పిల్లి అనంతలక్ష్మి, అప్పటి ఎంపీ పళ్లంరాజు, బొడ్డు భాస్కర రామారావు తదితరుల సహకారంతో ఈ నిర్మాణాల ఆలోచనకు రూపకల్పన జరిగిందని, పిల్లి సత్తిబాబు ప్రత్యేక చొరవతో కృషి చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌బాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధుల సహకారంతో పనులను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు, దాతలు, నాయకులు సహకరించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.  అనంతరం ఆలయంలో భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సానా సతీష్‌బాబు సేవాదళం సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ అరిగేల బున్ని, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పాలిక సతీష్, గింజల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జి తదితర నాయకులు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...