బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ ర్యాలీ

కాకినాడ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ ఇమ్మంది లక్ష్మీ పార్థసారథి గారి ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఘనంగా కార్గిల్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీ కాకినాడలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమై, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని అమరవీరుల స్థూపం వరకు సాగింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చోడిశెట్టి రమేష్ గారు, కుండల సాయి యాదవ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు పెండం శ్రీదేవి గారు, ముసలిగంటి సురేష్ గారు, దొడ్డి వీరేంద్ర గారు, గౌతు చిన్నారావు గారు, కర్రి సత్యనారాయణ రాజు గారు, చెక్క రమేష్ గారు పాల్గొన్నారు. అలాగే యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏనుగుల లచ్చబాబు గారు, జట్ల దుర్గా చైతన్య సాయి గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఓలేటి రాంబాబు గారు, వాసం మధు గారు, కర్రి వీరేంద్ర గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, యువ మోర్చా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వ ధైర్యసాహసాలు, త్యాగాలు దేశ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని, దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...