యువత తలచుకుంటే ప్రభుత్వాలను గద్దె దించగలరు

కాకినాడ : దేశవ్యాప్తంగా యువత చేపట్టిన పోరాటంతో కేంద్ర మంత్రితో రాజీనామా చేయించవచ్చని నిరూపితమైందని జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవజ్ఞులు జగ్గరపు మల్లికార్జున పేర్కొన్నారు. ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఈ చారిత్రాత్మక పోరాటాన్ని పార్టీ తరఫున ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా జగ్గరపు మల్లికార్జున్ మాట్లాడుతూ యువత తలచుకుంటే రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా ఎవరినైనా గద్దె దించగలమనే సత్యాన్ని ఈ ఉద్యమం రుజువు చేసిందని ఆయన తెలిపారు. దేశం, ప్రపంచం చూసేలా ఇంత పెద్దఉద్యమంజరుగుతున్నప్పటికీ మిగతా రాజకీయ నాయకుల గొంతులు మూగపోవడంపై విమర్శలు గుప్పించారు. గత 6 సంవత్సరాల నీట్ పరీక్ష రికార్డులను పరిశీలిస్తే సుమారు 93 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటం అత్యంత ఆవేదనకరమని పేర్కొన్నారు. 2026 సంవత్సరంలో విద్యార్థులు పోరాడి సాధించిన విజయాన్ని, ఆ చనిపోయిన 93 మంది విద్యార్థులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం నీట్ ఉద్యమం కాదని, జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువత ఉద్యమమని స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ 3-4 రోజులు ప్రత్యక్షంగా పాల్గొని విద్యార్థులకు భరోసానివ్వడం అభినందనీయమన్నారు. రాహుల్ గాంధీ, సీజేపీ (CJP) నాయకులు, నిరాహార దీక్ష చేసిన పెద్దలు, ఆజాద్ తదితరులందరికీ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా సుమారు 270 పోటీ పరీక్షలను కేంద్రం నిర్వహించిందని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా సుమారు 12 కోట్ల 60 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని వెల్లడించారు.ప్రభుత్వాల వైఖరిపై నిలదీత: కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరమై రోడ్లెక్కి పోరాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత ఆలస్యం చేయడం తగదన్నారు. ప్రజలు ఉద్యమించకపోతే ప్రభుత్వాలు స్పందించవని హెచ్చరించారు. దేశంలో సుమారు 30 రకాల పరీక్షల వ్యవస్థలు ఉండగా, కేవలం 25 రకాల పరీక్షలను మాత్రమే 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' (NTA) నిర్వహిస్తోందని పేర్కొన్నారు.ప్రపంచ స్థాయిలో రెండో స్థానం: చైనా తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక పరీక్షా కేంద్రంగా మరియు అతిపెద్ద పరీక్షా నిర్వహణ సంస్థగా NTA నిలిచింది. కేవలం 221 మంది ఉద్యోగులతో కోట్ల మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుండటం వల్లనే లీకులు, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఇంజనీరింగ్ (JEE), యూనివర్సిటీ ప్రవేశాలు, UGC నెట్ (NET), ICAR, ప్రొఫెసర్ల పరీక్షలు, సైనిక్, నావిక్ స్కూల్స్ వంటి ముఖ్యమైన పరీక్షలన్నీ NTA చేతుల్లోనే ఉన్నాయి.నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షా పేపర్లు లీక్ కావడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కష్టం వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.పేపర్ లీక్ కాలేదని, ఎవరో డబ్బుల కోసం అమ్ముకున్నారంటూ కొందరు ఎంపీలు బాధ్యతారహితంగా మాట్లాడటం సరైనది కాదన్నారు. మే 12న ప్రారంభం కావాల్సిన ఉద్యమం కోసం, మే 3నే పరీక్షలు నిర్వహించినప్పటికీ, అవి మే 12న రద్దు చేయబడ్డాయి. ఢిల్లీ నడిబొడ్డున విద్యార్థులు చేసిన ఆందోళన ఫలితంగా జూలై 25న ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉదయ్ శ్రీనివాస్ (ఎంపీ) వంటి పలువురు ప్రముఖుల విద్యా అర్హతలను ప్రస్తావించారు అసలు మీకున్న అర్హత ఏమిటి ఒకరేమో పదో తరగతి అయితే మరొకరి ఇంటర్మీడియట్ ఇది వీళ్లు మనల్ని పరిపాలిస్తున్నారు.. విద్యార్థుల కష్టాలు, పోటీ పరీక్షల ఇబ్బందులు వీరికి తెలుసా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల కోసమే కాకుండా, యువత తలుచుకుంటే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రులు సైతం గద్దె దిగే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యువత ఐక్యంగా పోరాడాలని జగ్గరపు మల్లికార్జున పిలుపునిచ్చారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...