సవాలుగా మారిన కేసును సక్సెస్ చేసిన మెడ్వే సంజీవి ఆస్పత్రి వైద్యులు

కాకినాడ : అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఆస్పత్రికి తరలివచ్చిన ఓ యువకుడికి మెడ్వే సంజీవి ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. గుండెలోని మిత్రల్ కవాటం పనిచేయకుండా పోవడం (స్టక్ మిత్రల్ వాల్వ్)తో పాటు ఊపిరితిత్తుల్లో రక్తగడ్డలు ఏర్పడిన (పల్మనరీ త్రాంబోఎంబోలిజం) క్లిష్ట పరిస్థితిలో 28 ఏళ్ల అశోక్ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు.

ఆస్పత్రి వర్గాల వివరాల ప్రకారం.. రోగి స్పృహ కోల్పోయిన స్థితిలో రాత్రి 10.30 గంటల సమయంలో ఆస్పత్రికి తరలివచ్చాడు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి తీవ్రతను గుర్తించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫణిరాజ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ కృష్ణ పృథ్వి, అనస్థీషియాలజిస్టులు డాక్టర్ సందీప్, డాక్టర్ శ్రావణ్‌లతో కూడిన ప్రత్యేక వైద్య బృందం సమన్వయంతో చికిత్స చేపట్టింది.

రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ వైద్యుల సమయస్ఫూర్తి, నైపుణ్యం, అత్యాధునిక వైద్య సదుపాయాల సహాయంతో చికిత్స విజయవంతమైందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అశోక్ ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా విజయవంతమైన చికిత్సలో కీలకపాత్ర పోషించిన వైద్య బృందాన్ని సెంటర్ హెడ్ రాపాక దినేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ వినూత్న ప్రియా అభినందించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యుల సేవలు, 24 గంటల అత్యవసర వైద్య సదుపాయాలతో మెడ్వే సంజీవి ఆస్పత్రి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని వారు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష