జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలి... కలెక్టర్‌కు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ వినతి

కాకినాడ జిల్లా : జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కార్యవర్గం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కోరింది. ఈ మేరకు క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు అంజిబాబు, శ్రీనివాస్, బాబ్జి, సతీష్, నారాయణ తదితరులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం వార్తల సేకరణలో నిమగ్నమై ఉండే జర్నలిస్టులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, వారి పిల్లల విద్యాభారం తగ్గించేలా ఫీజు రాయితీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పలువురు కలెక్టర్లు జర్నలిస్టుల పిల్లలకు ఈ సదుపాయం కల్పించారని గుర్తు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష