జర్నలిజంతో పాటు సేవా కార్యక్రమాలు అభినందనీయం: కలెక్టర్ హరేంధిర ప్రసాద్
కాకినాడ : కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వ కార్యక్రమంలో సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి మోహన్, అడ్వైజరీ కమిటీ సభ్యులు అంజిబాబు, దురాని, కృష్ణ, ఆకెళ్ల శ్రీనివాస్, సతీష్, బన్నీ, వీరు తదితరులు పాల్గొన్నారు. పంచాంగ ఆవిష్కరణ సందర్భంగా కలెక్టర్‌కు పంచాంగ ప్రతిని అందజేసి క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ర్యంలో ముద్రించిన ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ సరిపెల్ల వెంకట శ్రీరామచంద్రమూర్తి సిద్ధాంతి విరచిత శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగంను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జర్నలిజం రంగంలో వార్తల ప్రసారంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అభినందనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న క్లబ్ సభ్యులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని సూచించారు.
కార్యక్రమంలో సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి మోహన్, అడ్వైజరీ కమిటీ సభ్యులు అంజిబాబు, దురాని, కృష్ణ, ఆకెళ్ల శ్రీనివాస్, సతీష్, బన్నీ, వీరు తదితరులు పాల్గొన్నారు. పంచాంగ ఆవిష్కరణ సందర్భంగా కలెక్టర్‌కు పంచాంగ ప్రతిని అందజేసి క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

Comments
Post a Comment