5 నెలలుగా వృథా అవుతున్న తాగునీరు... పట్టించుకోని అధికారులు

కాకినాడ రూరల్ : గ్రామంలో ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి నెలల తరబడి మంచినీరు వృథాగా పోతున్నా అధికారులు, పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని తూరంగి మాజీ ఎంపీటీసీ పితాని వెంకట రాము ఆరోపించారు.

కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలోని గోపీనగర్ పార్క్ సమీపంలో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి సుమారు ఐదు నెలలుగా నీరు నిరంతరం వృథాగా పోతున్నప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఒకవైపు తూరంగి తీర ప్రాంత కాలనీల ప్రజలు తాగునీటి సమస్యతో ధర్నాలు చేస్తుంటే, మరోవైపు విలువైన తాగునీరు వృథా కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, కేవలం వెయ్యి రూపాయలతో పరిష్కరించగలిగే చిన్న మరమ్మతును ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ట్యాంక్ మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టి, గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని పితాని వెంకట రాము డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...