కూటమి నేతలైనా వదిలేది లేదు.. పన్ను ఎగవేతదారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

అమరావతి : నెలకు రూ.10 వేల సంపాదించే సాధారణ ఉద్యోగిపై పన్నుల భారం మోపుతున్నామని, కానీ కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ భారీ ఆదాయాలు ఆర్జిస్తున్న వారి వద్ద నుంచి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయడంలో వ్యవస్థ విఫలమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పన్నుల విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండకూడదని, అది కూటమి పార్టీల నాయకులైనా, అధికార పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీసే పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లించే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలపై అదనపు భారం మోపడం కంటే భారీ స్థాయిలో వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దాచిపెడుతున్న వారిని గుర్తించి వసూళ్లు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి రూపాయి కీలకమని, ప్రజల సొమ్మును కాపాడటంలో ప్రభుత్వం రాజీపడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...