పులి పంజా.. 13 లేగదూడల బలి

దేవీపట్నం: అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పులి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన పులి దాడిలో 13 లేగదూడలు మృతి చెందాయి. ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పులి కదలికలను గుర్తించి పట్టుకునేందుకు 6 ర్యాపిడ్ రెస్క్యూ బృందాలు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్విలైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, ఒక కేజ్ బృందం, ఒక వన్యప్రాణి అంబులెన్స్ బృందంతో పాటు 19 హనుమాన్ బృందాలను రంగంలోకి దింపారు. మొత్తం సుమారు 100 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్. నాగేశ్వరరావు, రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డీఎఫ్‌ఓ ఎన్. రామచంద్రరావు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పశువులను కోల్పోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

మరోవైపు ప్రజల భద్రత దృష్ట్యా పోతవరం–దండంగి రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి దిగ్బంధం చేశారు. పులి సంచారంపై గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ అటవీ శాఖ నిఘా కొనసాగిస్తోంది. అధికారులు ప్రజలు ఒంటరిగా అడవివైపు వెళ్లవద్దని, అటవీ శాఖ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.: అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పులి బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన పులి దాడిలో 13 లేగదూడలు మృతి చెందాయి. ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పులి కదలికలను గుర్తించి పట్టుకునేందుకు 6 ర్యాపిడ్ రెస్క్యూ బృందాలు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్విలైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, ఒక కేజ్ బృందం, ఒక వన్యప్రాణి అంబులెన్స్ బృందంతో పాటు 19 హనుమాన్ బృందాలను రంగంలోకి దింపారు. మొత్తం సుమారు 100 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్. నాగేశ్వరరావు, రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డీఎఫ్‌ఓ ఎన్. రామచంద్రరావు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పశువులను కోల్పోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

మరోవైపు ప్రజల భద్రత దృష్ట్యా పోతవరం–దండంగి రహదారిపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి దిగ్బంధం చేశారు. పులి సంచారంపై గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ అటవీ శాఖ నిఘా కొనసాగిస్తోంది. అధికారులు ప్రజలు ఒంటరిగా అడవివైపు వెళ్లవద్దని, అటవీ శాఖ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు