భజన బృందాన్ని ఘనంగా సత్కరించిన పుట్టకొండ గ్రామ పెద్దలు


కాకినాడ జిల్లా : పెదపూడి
మండలం పుట్టకొండ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ద్వితీయ సప్తాహ మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భజనలు, సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.సప్తాహ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన భజన కార్యక్రమంలో సువర్ణ సింహతలాట సన్మానితులు శ్రీ సలాది బ్రహ్మానందం పాల్గొని భక్తి గీతాలతో భక్తులను అలరించారు. ఆయనతో పాటు పాల్గొన్న భజన బృందం సభ్యులు ఆధ్యాత్మిక గానామృతంతో భక్తులను పరవశింపజేశారు. కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు కలిసి భజన బృందాన్ని ఘనంగా సత్కరించారు. శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కూళ్ళ బాబి, బంటుమిల్లి ప్రసాద్, అద్దంకి సూరిబాబు, తోటపేట అంజిబాబు, రాజేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. భజన కార్యక్రమానికి హార్మోనియంపై శ్రీ అద్దంకి శివ, డోలుపై శ్రీ లోకేష్ సహకారం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంకీర్తన కార్యక్రమం ముగిసిన అనంతరం నిర్వాహకులు సంకీర్తన పరులను ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. సప్తాహ మహోత్సవాల సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. మహోత్సవాలు విజయవంతంగా కొనసాగేందుకు గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...