చంద్రబాబు దగాకు వారంటీ.. హామీలకు గ్యారంటీ లేదన్న వైఎస్సార్‌సీపీ నేత నాగమణి
విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ‘తల్లికి వందనం’ నిధులు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన రెండేళ్ల పాలన సభలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడం తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు కొత్తగా అందించిన ప్రయోజనాలు కనిపించడం లేదని విమర్శించారు.
రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రుణాలు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలపై ప్రభుత్వం స్పందించడం లేదని నాగమణి పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని, ప్రభుత్వం మాత్రం జగన్ పేరును ప్రస్తావిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
ప్రజలను ఎప్పటికీ మోసం చేయడం సాధ్యం కాదని, రానున్న రోజుల్లో మహిళా శక్తి తన సత్తా చాటుతుందని నాగమణి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments
Post a Comment