ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన బీజేపీ మైనారిటీ మోర్చా నాయకుడు షేక్ సర్ధార్ హుస్సేన్
కాకినాడ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిని రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి బంగ్లాలో భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా పెదపూడి మండల అధ్యక్షుడు షేక్ సర్ధార్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఈ (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ), డీఎండీ (డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ) వంటి ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్న రోగుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భారత ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరు, భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలపై మంత్రివర్యులతో సుదీర్ఘంగా చర్చించినట్లు షేక్ సర్ధార్ హుస్సేన్ తెలిపారు. ముఖ్యంగా ఈ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు, బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ పరంగా మరింత ఆర్థిక సహాయం, సహకారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ వ్యాధుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment