ఈ కోడిని వేటాడితే మూడేళ్ల జైలు
భారతదేశం : అడవుల్లో కనిపించే గ్రే జంగిల్ ఫౌల్ (అడవి కోడి)ను వేటాడటం, విక్రయించడం లేదా ఆహారంగా వినియోగించడం చట్టరీత్యా నేరమని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మన దేశానికి ప్రత్యేకమైన ఈ అరుదైన పక్షి వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో రక్షణ పొందుతోంది. గింజలు, కీటకాలు, చిన్న జీవులను ఆహారంగా తీసుకునే ఈ పక్షులు అడవుల పర్యావరణ సమతుల్యతకు కీలకంగా ఉపయోగపడతాయి. ప్రమాదం ఉందని గుర్తిస్తే వెంటనే చెట్లపైకి ఎగిరి రక్షణ పొందడం వీటి ప్రత్యేకత. ఈ పక్షులను వేటాడినట్లు లేదా మాంసం విక్రయించినట్లు తేలితే నిందితులకు జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, అడవి జంతువులు, పక్షుల వేటపై సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

Comments
Post a Comment