పండూరు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే నానాజీ
కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ మండలం పి. వెంకటాపురం గ్రామంలోని పండూరు చెరువు ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం పండూరు చెరువు ప్రాంతంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ పి. వెంకటాపురంలోని పండూరు చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.50 లక్షల వాటర్‌షెడ్ నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. గట్టు బలపరిచే పనులతో పాటు వాకింగ్ ట్రాక్, గట్టుపై బెంచీలు, సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం, మొక్కల పెంపకం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ పనుల ద్వారా స్థానిక యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖాదీ బండారు స్టేట్ డైరెక్టర్ శిరంగి శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎంపీడీవో సతీష్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాటికాయల వీరబాబు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ నందిపాటి శ్రీనివాస్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మదారపు తాతాజీ, సుబ్రహ్మణ్యం, బాలు, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment