అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Andhra Pradesh : YSR Kadapa district గోపవరం మండలం పీపీ కుంట సమీప అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు మరియు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్సుల ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Comments

Popular posts from this blog

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష