తిరుపతిలో ఎన్ఆర్ఐకి షాక్.. హోటల్ లాకర్‌లోని 1000 డాలర్లు మాయం

తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనానికి సింగపూర్ నుంచి కుటుంబంతో వచ్చిన ఓ ఎన్నారైకి తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాసా సరోవరం హోటల్‌లోని రూమ్ నెంబర్ 1017లో బస చేసిన ఆర్ముగం కుటుంబం, శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చూడగా లాకర్‌లో ఉంచిన 1000 అమెరికన్ డాలర్లు కనిపించలేదు. దీంతో బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నంబర్ 191/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును అలిపిరి ఎస్‌ఐ దుర్గాప్రసాద్ విచారిస్తున్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ