మూడు క్లస్టర్లలో మహానాడు విజయవంతం.. బాబీని సత్కరించిన టిడిపి నేతలు

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కరప మండలంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమాన్ని మూడు క్లస్టర్ల పరిధిలో సమన్వయంతో విజయవంతంగా నిర్వహించి పార్టీ శ్రేణుల ప్రశంసలు అందుకున్నారు. మహానాడు నిర్వహణలో బాబి చూపించిన వ్యూహరచన, నాయకత్వం, కార్యకర్తల సమీకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు గండి వెంకటేశ్వరరావు వేదికపైనే బాబిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. “పార్టీ బలోపేతానికి బాబి చేస్తున్న కృషి అభినందనీయం. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న కార్యాచరణ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి” అని కొనియాడారు. సీనియర్ నాయకులను గౌరవిస్తూ, కార్యకర్తలను కలుపుకుని ముందుకు తీసుకెళ్తున్న బాబి తీరు ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి, క్లస్టర్ ఇంచార్జ్ గండి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు యాసలపు విష్ణు, పంపన కన్నారావు, యనమదల దొరబాబు, జల్దాని నూకరాజు, పోతల గోవిందు, యడ్ల చిట్టిబాబు, చీపురుపల్లి అనిల్, మల్లాడి రాంబాబు, మహేష్, చక్రం, మట్టపర్తి కొండ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు