వరుస చోరీల వెనుక అసలు వ్యక్తి అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం
కాకినాడ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ములపార్తి దుర్గప్రసాద్‌ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడిన నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.32 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ వివరాలను ఎస్‌డీపీఓ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. కార్యక్రమంలో సర్పవరం సీఐ ప్రకాష్, క్రైమ్ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment