అనపాల ఆంజనేయులు రెడ్డిని అభినందించిన సానా సతీష్ బాబు
కాకినాడ : సమాజ సేవను బాధ్యతగా భావిస్తూ సంవత్సరం పొడవునా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనపాల ఆంజనేయులు రెడ్డిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అభినందించారు. మండుటెండల్లో ప్రజలకు, పేదలకు, పాదచారులకు చల్లని తాగునీరు అందించడంతో పాటు మూగజీవాలైన పశువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేకంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తూ విద్యకు ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజంలో సేవా భావాన్ని చాటుతున్నారని కొనియాడారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు దూరంగా నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆంజనేయులు రెడ్డి సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని సానా సతీష్ బాబు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువై సామాజిక కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments
Post a Comment