కౌడ సేవల విస్తరణకు కృషి చేస్తా: తలాటం సత్య
కాకినాడ జిల్లా :
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడ) సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా విస్తరణ చర్యలు చేపడతానని కౌడ నూతన చైర్మన్ తలాటం నాగ సత్యనారాయణ (సత్య) పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ కుళాయి చెరువులోని గోదావరి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ సత్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, అవకాశం లభిస్తుందని, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కౌడ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ పదవి లభించడానికి సహకరించిన పార్టీ నాయకత్వానికి, మద్దతుదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, నాయకులు వేగుళ్ల లీలాకృష్ణ, పెండెం దొరబాబు, ముత్తా నవీన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు, పిల్లి అనంతలక్ష్మి, నురుకుర్తి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment