కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్.. అభిమానులకు స్టేడియం అనుభూతి

 కాకినాడ: టాటా ఐపీఎల్-2026 ఫ్యాన్ పార్క్స్ ద్వారా క్రికెట్ అభిమానులకు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని అందిస్తున్నామని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్త తెలిపారు. కాకినాడలోని కృషి భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐపీఎల్‌ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 29, 31 తేదీల్లో జిల్లా క్రీడా మైదానంలో ఫ్యాన్ పార్క్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లపై మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలతో పాటు సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 50 నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కాకినాడ అభిమానులకు పూర్తి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...