ఆదివాసీ రేలా ఉత్సవాల విజయానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
రంపచోడవరం : కేంద్రంగా జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీ రేలా ఉత్సవాల జయప్రదానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆదివాసీ గిరిజన సంఘం పోలవరం జిల్లా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ ఆదివాసీల అస్తిత్వం, ఉనికి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈ రేలా ఉత్సవాలు నిలిచాయని తెలిపారు. కనుమరుగవుతున్న ఆదివాసీ భాష, ఆట, పాట, కట్టు, బొట్టు, నృత్యాలను కాపాడుకునే దిశగా ఈ ఉత్సవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.జిల్లా కార్యదర్శి పులి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, హక్కులు, చట్టాల పరిరక్షణకు ఈ ఉత్సవాలు అన్ని తెగల ఆదివాసీల ఐక్యతకు దోహదపడతాయని అన్నారు. భవిష్యత్ తరాలకు పూర్వీకుల సంప్రదాయాలను అందించే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి ఉత్సవాలను కొనసాగిస్తామని చెప్పారు. ర్యాలీలు, సభలు, ఉత్సవాలకు సహకరించిన ఆదివాసీ పెద్దలు, సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, మీడియా మిత్రులు, పోలీసు సిబ్బంది, వాలంటీర్లు, రంపచోడవరం పట్టణ ప్రజలకు జిల్లా కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Comments
Post a Comment