రాష్ట్ర సినీ అభివృద్ధి సంస్థ కమిటీలో చిలకలూరిపేటకు చెందిన ముగ్గురికి స్థానం
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) నూతన కమిటీలో చిలకలూరిపేట ప్రాంతానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కమిటీలో ప్రాంతానికి చెందిన ముగ్గురు ప్రముఖులు డైరెక్టర్లుగా ఎంపిక కావడం విశేషంగా మారింది. డాక్టర్ కందిమళ్ళ సాయిశివరావుతో పాటు నాదెండ్ల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు శివాజీ శొంఠినేని, యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు వి. సముద్రలకు కమిటీలో స్థానం లభించింది. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు సినీ రంగ ప్రముఖులకు రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రాతినిధ్యం దక్కడం పట్ల నియోజకవర్గ పరిధిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. స్థానిక గ్రామస్తులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ఎంపికలు ప్రాంతానికి గౌరవాన్ని తీసుకొచ్చాయని పేర్కొన్నారు.

Comments
Post a Comment