కరకుదురు గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి దత్తుడు హామీ

LocalNewsAp:

పెదపూడి మండలం కరకుదురు గ్రామంలోని అడపావారి వీధి, గుండావారి వీధి, పాఠంశెట్టి వారి వీధుల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ లేక సుమారు 200 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన విద్యుత్ సరఫరా లేక చిన్నపిల్లలతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలని కరకుదురు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సింగినీడి దత్తుడును గ్రామస్తులు కోరారు.దీనిపై స్పందించిన సింగినీడి దత్తుడు వెంటనే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడినట్లు తెలిపారు. బుధవారం లోపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు