ఘనంగా ఎమ్మెల్యే సత్యప్రభ జన్మదిన వేడుకలు
కాకినాడ జిల్లా: ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా జన్మదిన వేడుకలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు తదితరులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పెద్ద మార్కెట్ సెంటర్‌లో బాటసారులకు మజ్జిగ, చల్లని త్రాగునీరు పంపిణీ చేశారు. అలాగే అన్న ఎన్టీఆర్ జనార్ధన్ క్యారేజీ ద్వారా పేదలకు చికెన్ బిర్యానీ, మహిళలకు చీరలు, ఐదు కిలోల బియ్యం సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యప్రభ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండపాక శ్రీనివాస్, మండపాక సాయిరాం, కాలాడి వెంకటేష్, పేర్ల సత్తిబాబు, నవీన్, సంతోష్, శ్రీధర్, కర్రి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment