విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” నినాదంతో కొనసాగుతున్న ఉద్యమం

 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న 1877వ రోజు పోరాట టెంట్‌లో ఈరోజు రిలే నిరాహార దీక్షలను ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన కార్మిక నేతలు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదం ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ఆర్థిక బలానికి వెన్నెముకలని, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. ఉక్కు కర్మాగారం వేలాది కుటుంబాల జీవనాధారమని, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్, మేరపురెడ్డి కొండబాబు, గుమ్మడి ఆదినారాయణమూర్తి, పారుపూడి రవి, టి. సాంబశివరావు, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...