రోడ్డు ప్రమాదంలో ఉప్పాడ మత్స్యకారుల మృతి బాధాకరం: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్


కాకినాడ : సామర్లకోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉప్పాడకు చెందిన ఇద్దరు మత్స్యకారులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని కాకినాడ ఎంపీ Uday Srinivas ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జీవనోపాధి కోసం పెద్దాపురం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎంపీ, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఐదుగురికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...