న్యాయం కోరితే హౌస్ అరెస్ట్ చేయడం దారుణం: వాసంశెట్టి రాజేశ్వరరావు

కాకినాడ : న్యాయం చేయాలని అడిగిన వారిని హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నూకాలమ్మ గుడి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పిల్లి నానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆసుపత్రి వద్దకు వెళ్లేందుకు సంఘం పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెంలోని తన నివాసంలో మాట్లాడుతూ, ఆసుపత్రికి బయలుదేరిన సమయంలో పోలీసులు వచ్చి తనను హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు. మృతుడు పిల్లి నానికి ఇద్దరు చిన్నపిల్లలు ఉండగా, భార్య గర్భిణిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే అణగదొక్కుతున్నాయని వాసంశెట్టి అసహనం వ్యక్తం చేశారు. తమను ఆసుపత్రి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నప్పటికీ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లి నాని కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వం పరంగా తగిన సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పితాని రాజకుమారి, కట్టా విజయరాజు, ఎస్టీ గిరిజన ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుకూర రామకృష్ణ, తాళ్లూరు శ్రీనివాస్, బత్తిన అర్జున, కొప్పిశెట్టి తాతాజీ, వాసంశెట్టి వెంకటరమణ, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు