ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం...నులుకుర్తి వెంకటేశ్వరరావు
కాకినాడ రూరల్ : రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 48వ వార్డులో శనివారం కాకినాడ రూరల్ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డా. చప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి సైతం ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిల్ల కృష్ణ ప్రసాద్ (బుజ్జి), క్లస్టర్ ఇన్‌చార్జీలు కర్రీ వెంకటరాజు, పేరాబత్తుల లోవబాబు, మీరపల ప్రకాష్, ఏఎంసీ చైర్మన్ మాసుమేను గంగయ్య, నాయకులు దేవు వెంకటేశ్వరరావు, కొండా వినాయక్, కాళ్ల శ్రీను, సీతయ్య దొర, పెంకే గోవింద్, కొనాల కృష్ణ, చింతపల్లి సత్తిబాబు, తిరుమలరావు, వాసు, రామకృష్ణ, నాగరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment