క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుంటాం... కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి

కాకినాడ : జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి జట్ల ఎంపికల ట్రయల్స్ శనివారం కాకినాడ డీఎస్సీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, విశిష్ట అతిథిగా మాజీ కాకినాడ పార్లమెంట్ సభ్యుడు ఉప్పలపాటి కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి హాజరై క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. శ్యామలాదేవి మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, కాకినాడతో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తన భర్త కృష్ణంరాజుకు క్రీడలంటే ఎంతో అభిమానం ఉండేదని, ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. కాకినాడకు చెందిన పలువురు వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. బీజేపీ నాయకుడు ఎన్.వి. సాయిబాబు మాట్లాడుతూ సాఫ్ట్ టెన్నిస్ ఎంపికల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పాన్సర్షిప్ చేసినందుకు సత్య స్కానింగ్ సీఈఓ కాదా వెంకటరమణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా శ్యామలాదేవి హాజరై క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించి వారికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌డీఓ కాకినాడ డి. సతీష్‌కుమార్, సత్య స్కానింగ్ సీఈఓ కాదా వెంకట రమణ, చిక్కాల తాతాజీ, ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ నవీన్‌కుమార్, అధ్యక్షుడు శ్రీనుబాబు, కోశాధికారి బి. నీరజ, డీఈఓ రమేష్, డీవైఈఓ కె.వి.వి. సత్యనారాయణ, పి. శ్రీనివాస్, వి. మాచిరావు, కె. నాగలింగేశ్వరరావు, కె. శ్రీనివాసరావు, పి. సుధారాణి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...