అన్యోన్యతకు 21 ఏళ్లు.. రాజు - రాణి దాంపత్యానికి శుభాకాంక్షల వెల్లువ

కాకినాడ రూరల్ : ప్రేమకు అనుబంధం తోడై.. కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తూ.. 21 ఏళ్ల వైవాహిక జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న గంగనాపల్లి గ్రామానికి చెందిన పాండ్రంకి రాజు–మృదుల రాణి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ దాంపత్య జీవితంలో 21వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులు ఆత్మీయులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వృత్తిరీత్యా వ్యాపారవేత్తగా కొనసాగుతున్న పాండ్రంకి రాజు రాజకీయ నేపథ్యంతో ప్రజా జీవితంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మితభాషిత్వం.. అందరినీ ఆప్యాయంగా పలకరించడం.. స్నేహానికి విలువ ఇవ్వడం ఆయన ప్రత్యేకతలుగా చెబుతారు. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే తపన.. తనకు చేతనైనంత సాయం చేయాలనే సేవా దృక్పథం ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతోంది. రాజు,మృదుల రాణి దంపతులు 21 ఏళ్లుగా కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ అన్యోన్య దాంపత్యానికి ప్రతిరూపంగా నిలిచారు. వారి వైవాహిక ప్రయాణం ఇలాగే ప్రేమానురాగాలతో.. ఆనంద సంతోషాలతో.. కుటుంబ సభ్యులు స్నేహితులు ఆత్మీయుల మధ్య మరెన్నో మధుర జ్ఞాపకాలకు వేదిక కావాలని ఆకాంక్షిద్దాం. ఆ దంపతులు ఆయురారోగ్యాలతో ఆనంద సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 21వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వారి అనుబంధం కలకాలం ఇలాగే వర్ధిల్లాలని.. ప్రతి అడుగు విజయంతో.. ప్రతి రోజు మధుర జ్ఞాపకంగా నిలవాలని ఆకాంక్షిద్దాం.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...