జగన్‌పై యనమల ఘాటు విమర్శలు “రాష్ట్ర ప్రయోజనాలపై జగన్‌కు చిత్తశుద్ధి లేదు”


కాకినాడ జిల్లా తునిలో తెలుగు దేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ నిర్వహించిన రెండు గంటల ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సమస్యలు ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు. స్వప్రచారానికే పరిమితమైన జగన్, చంద్రబాబు మరియు టీడీపీపై నిరాధార ఆరోపణలు చేశారని అన్నారు. అవినీతి కేసుల్లో సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎదుర్కొంటున్న జగన్‌పై ఇప్పటికే పలువురు చార్జ్‌షీట్లు నమోదయ్యాయని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదని యనమల ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని, కానీ జగన్ రాజకీయాలు మాత్రం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు