నాలుగు దశల్లో స్వచ్ఛ కాకినాడ ఆపరేషన్ క్లీన్ స్వీప్
కాకినాడ, మే 23: ‘ఒక రాష్ట్రం.. ఒక పరిశుభ్రత లక్ష్యం’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ, కమిషనర్ సత్యనారాయణ పాల్గొని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతపై అవగాహనతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


Comments
Post a Comment