జగన్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి : నాగమణి
కాకినాడ, మే 22 : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. జగన్ చేసిన విమర్శల్లో తప్పులుంటే వాటిపై స్పందించాలని, సమాధానం చెప్పలేక మాటల దాడికి దిగడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్రలు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా లేవన్నారు. రాష్ట్రంలో మద్యం, మట్టి, ఇసుక మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదానికి మద్యం సేవించి వాహనం నడపడమే కారణమన్నారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం విమర్శలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని నాగమణి విమర్శించారు.

Comments
Post a Comment