తప్పుడు ప్రచారాలు మానుకోవాలి - ప్రొఫెసర్ నాగేశ్వరావుకు నానాజీ హెచ్చరిక
జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వరావు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మండిపడ్డారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం గంగరాజు నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీపై తప్పుడు ప్రచారాలు వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీ వద్ద డబ్బులు తీసుకుని కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరావు వద్ద నిజమైన ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలని సవాల్ విసిరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్ సమావేశంపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వెనుక దురుద్దేశం ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై విషప్రచారం చేయడం సరైంది కాదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సమావేశంలో శిరంగు శ్రీనివాస్ వల్లూరి రాజా తిరుమాని కుమారస్వామి తాటికాయల వీరబాబు కరెడ్ల గోవింద్ బండారు మురళి బోగిరెడ్డి కొండబాబు మాదారపు తాతాజీ యాళ్ల సత్యనారాయణ సోదే ముసలయ్య సైనవరపు శంకర్ నల్లం శ్రీరాములు సుందర సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment