కరప మండల అభివృద్ధికి రూ.151 కోట్ల వ్యయం : ఎమ్మెల్యే నానాజీ

  • కరప మండలం,: కరప మండలం ఎంపీడీఓ కార్యాలయంలోని చంద్రన్న సమావేశ మందిరంలో కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరప మండలంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సుమారు రూ.151 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సర్వేలో కాకినాడ రూరల్ నియోజకవర్గం తక్కువ స్థాయిలో నిలిచిన మెడికల్, పౌర సరఫరాలు, మధ్యాహ్న భోజన పథకాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మెరుగైన పురోగతి సాధించాలని విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు, అందులో తాను స్వయంగా పాల్గొంటానని తెలిపారు. కూరాడ గ్రామ పాఠశాల సందర్శనలో విద్యార్థులు ఐడీ కార్డులు కావాలని కోరగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక ఐడీ కార్డులు రూపకల్పన చేసి వచ్చే జూన్ నెలలో 10 వేల కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు ముద్రగడ రమేష్, నల్లే ప్రసన్న, బండారు మురళి, పబ్బినీడి పద్మావతి ప్రసాద్, యండమూరి వీరవేణి, పుణ్యమంతుల సింహాద్రమ్మ, అన్నవరం, కత్తుల ధనలక్ష్మి, యనమదల వెంకటలక్ష్మి, గొల్లపల్లి శేఖర్, సైనవరపు శంకర్, దూడల నారాయుడు, వెలుగుబంట్ల సూరిబాబు, మెండు గోవింద్, యర్రంశెట్టి ప్రసాద్, బండారు మణికంఠ, వై. రామకృష్ణ, ముత్యాలరావు, నక్కా అంజిబాబు, కూరాడ రాఖీ, గంగాధర్, భవాని, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు