ఏపీలో మరో 10 విమానాశ్రయాలు.. రాష్ట్రంలో విమానయాన రంగానికి భారీ ఊపు

Localnewsap : 

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న 6 విమానాశ్రయాలకు తోడు మరో 10 కొత్త ఎయిర్‌పోర్టులను నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దగదర్తి, కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, ఒంగోలు, అనంతపురం, తుని-అన్నవరం ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరో ప్రాంతం ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టితో అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుందని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...