కాకినాడ కు డాక్టర్ సామ్యూల్ దినకరన్
కాకినాడ: కారుణ్య విద్యాసంస్థల (డీమ్డ్ యూనివర్సిటీ) వైస్ చైర్మన్ డాక్టర్ సామ్యూల్ దినకరన్ అక్టోబర్ 18 నుండి 20 వరకు కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగే సివైఎఫ్ అంతర్జాతీయ యువజన మహోత్సవాలు "క్లిక్ అండ్ కమిట్ -2026"కు హాజరవనున్నారని సివైఎఫ్ డైరెక్టర్ బిహెచ్.వి మూర్తి రాజు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా చెడు వ్యసనాలతో జీవిస్తున్న అనేకమందిని సన్మార్గంలో నడిపిస్తున్న దైవజనులు బ్రదర్ సామ్యూల్ దినకరన్, సివైఎఫ్ డైరెక్టర్ డా.బి.హెచ్.వి మూర్తి రాజు యువతకు నైతిక విలువలు గూర్చి బోధించనున్నారు. ఈ సందర్భంగా మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ మహోత్సవాలలో ప్రపంచవ్యాప్తంగా వాడబడుచున్న ప్రముఖ భారతీయ పియానిస్ట్ కంపోజర్ సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవసి, వన్ మేన్ బ్యాండ్ ఇండియా గ్లాడ్సన్ పీటర్ వినూత్న రూపంలో సంగీతాన్ని అందించనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని గాయకులచే "ఏకమ్ సీజన్ 5"ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందన్నారు. రక్తదాన శిబిరం, జాబ్ మేళా అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి యువతకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు, మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం అందరికీ బహిరంగ సభ జరుగుతుందని అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యువతకు సామాన్యమైన భోజన,వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ కోఆర్డినేటర్స్ కలవల జాన్ విక్లిఫ్, పాస్టర్ మాసా సుదీర్ సన్నీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిస్టర్ ఉషారాణి, సునీల్, సి కె సింగ్,విజయ భాస్కర్, పెయ్యల నాని బాబు, మచ్చా బుజ్జి బాబు, తెలుగు రవి, వారా వినోద్, మధుసూదన్ రావు, వల్లూరి నానాజీ,చైతన్య, లోకేష్, షాలిని, అర్పణ,అను తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment