రెండేళ్ల పాలనపై ప్రజలకు అవగాహన కల్పించిన టీడీపీ నాయకులు
కాకినాడ రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో రమణయ్యపేట గ్రామపంచాయతీ పరిధిలోని పాత గైగోలుపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.

Comments
Post a Comment