ఇంటింటికీ తెలుగుదేశంతో సంక్షేమ ఫలాలు..... ప్రతి ఇంటా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు
కరప : ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో బుధవారం కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్తిబాబు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావుతో కలిసి ఇంటింటికీ వెళ్తూ ప్రజలతో నేరుగా ముచ్చటించారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా ప్రయోజన నిర్ణయాలను ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి సూచనల ఆధారంగా పాలనను మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, బుంగా సింహాద్రిలతో పాటు కూటమి నాయకులు దేవు వెంకన్న, బండారు మురళి, రెడ్డిపల్లి నారాయణరావు, రెడ్డి పల్లి భాస్కర్, తుమ్మలపల్లి మాచర్రావు, ఇంజనీర్ వెంకటేశ్వరరావు, గంటా నాని, తుమ్మలపల్లి గోవిందరాజు, పులపకూర శుభమహేష్, పంపన కన్నారావు, చాట్ర ఇమ్మానుయేలు, మద్దూరి స్వామి, పేపకాయల సత్తిబాబు మరియు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment