వైసీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా ముమ్మిడి శివశంకర్

పిఠాపురం...వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సెక్రటరీగా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెంకు చెందిన ముమ్మిడి శివశంకర్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఆయన తెలిపారు.తనకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్కు, కాకినాడ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు ముమ్మిడి శివశంకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా గ్రీవెన్స్ సెల్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చే సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత పార్టీ నాయకత్వం, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హులకు పథకాలు అందకపోవడం, స్థానికంగా అధికారుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పార్టీ గ్రీవెన్స్ సెల్ ద్వారా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. అలాగే గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుని, వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని శివశంకర్ పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల తరఫున నిరంతరం పోరాడేందుకు తన బాధ్యతను వినియోగిస్తానన్నారు.తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో, అంకితభావంతో నిర్వహించి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ముమ్మిడి శివశంకర్ స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ