ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు

పిఠాపురం రూరల్.. పితామహులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు, అనంతరం శ్రీనికేతన్ కరస్పాండెంట్ వెంకట రామ్మోహనరావు, ప్రిన్సిపాల్ లక్ష్మీ దేవి మరియు పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ నేటి తెలుగు భాష ప్రాధాన్యత నశించిపోతుందని ఆంగ్ల భాషకు ప్రాధాన్యతిస్తున్నారని, తెలుగు మాట్లాడడం కూడా మరిచిపోయే రోజులు వస్తాయని గిడుగు రామమూర్తి ఆనాడు కృషి నేటి వరకు తెలుగు భాష ప్రాధాన్యత దేశమంతటా గిడుగు రామమూర్తి తెలుగు భాషను సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి, వ్యవహారిక భాషను ప్రోత్సహించడానికి చేసిన కృషి చిరస్మరణీయమని, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే భాషలో విద్య అందించాలనే ఆలోచనను ఆయన బలంగా ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.ప్రస్తుత విద్యా వ్యవస్థలో మాతృభాషకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, తెలుగు భాష పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, గిడుగు రామమూర్తి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలని వెంకట రామ్మోహన్ తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు మరియు బోధనా సిబ్బంది పాల్గొన్నారు



Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ