హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కేసు విజయవంతం ..తల్లీబిడ్డల ప్రాణాలు కాపాడిన మెడికవర్ వైద్యులు

కాకినాడ జిల్లా ....  మెడికవర్ హాస్పిటల్స్‌లోని 'ఉమెన్ & చైల్డ్' విభాగం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైద్యులు ఓ క్లిష్టమైన హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కేసును విజయవంతంగా పూర్తి చేసి తల్లీబిడ్డలను కాపాడిన వివరాలను వెల్లడించారు. ఇటీవల 7.5 నెలల గర్భంతో తీవ్రమైన హై-రిస్క్ పరిస్థితుల్లో ఉన్న ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డా. లక్ష్మీ ప్రవీణ బి ఆధ్వర్యంలోని వైద్య బృందం గర్భిణిని నిరంతరం పర్యవేక్షించి, అత్యవసరంగా ప్రసవం నిర్వహించింది. నెలలు నిండకుండానే (ప్రీమేచ్యూర్) జన్మించిన శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఎన్‌ఐసీయూ కు తరలించారు. పీడియాట్రిషియన్ డా. వి. సుబ్బారావు ఆధ్వర్యంలో శిశువుకు వెంటిలేటర్ సపోర్ట్, ఐసీడీ ట్యూబ్ వంటి అత్యవసర చికిత్సలతో పాటు నిరంతర సంరక్షణ అందించారు. వైద్య బృందం అందించిన మెరుగైన చికిత్సతో శిశువు ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో, 15 రోజుల అనంతరం తల్లీబిడ్డలను సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా గైనకాలజిస్టులు డా. లక్ష్మీ ప్రవీణ, డా. కస్తూరిబాయి వెలగ, డా. సుజన నిమ్మకాయల, డా. శ్రావణి సాక్షి మాట్లాడుతూ హై-రిస్క్ ప్రెగ్నెన్సీలలో రెగ్యులర్ చెకప్‌లు, సరైన సమయంలో తీసుకునే వైద్య నిర్ణయాలు తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడటంలో కీలకమని పేర్కొన్నారు. పీడియాట్రిషియన్లు డా. వి. సుబ్బారావు, డా. రవి అంగర మాట్లాడుతూ ప్రీమేచ్యూర్ బేబీలకు అత్యాధునిక ఎన్‌ఐసీయూ పర్యవేక్షణ అత్యంత ముఖ్యమని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ నందికోళ్ల ఆంజనేయస్వామి (అంజిబాబు) మాట్లాడుతూ ఏడాది కాలంగా మహిళలు, చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, భవిష్యత్తులో కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు..

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ