బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట.. హెల్త్ క్లినిక్ ముందే చెత్త సామ్రాజ్యం..

కాకినాడ జిల్లా : పిఠాపురం మండలం కుమారపురం గ్రామ పంచాయతీ కార్యాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ ముందే పారిశుధ్యం పడకేసి, అధికారుల బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా నరికిన చెట్ల కొమ్మలు వల్ల పేరుకుపోతున్న ఇతర చెత్త తొలగించకపోవడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా మారి, జగనన్న కాలనీ వాసులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజా సమస్యలు తీర్చాల్సిన పంచాయతీ కార్యాలయం ముందే ఈ దారుణ పరిస్థితి ఉన్నా, సిబ్బంది మొక్కుబడి పనులతో చేతులు దులుపుకోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, తక్షణమే ఆ వ్యర్థాలను శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు

.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

పిఠాపురం మున్సిపల్ చైర్మన్ పీఠం.. సామాన్యుడికా? లేక బడా నాయకుల కనుసన్నల్లో డాక్టర్ కేనా? – తెరవెనుక రాజకీయాలపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ