డాక్టర్ కె శారదకు ఘన సన్మానం.. సరితకు ఆత్మీయ స్వాగతం

పిఠాపురం: పిఠాపురంలోని ఆర్ఆర్ బీ హెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రమోషన్‌పై డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర లెక్చరర్‌గా బదిలీ పొందిన డాక్టర్ కె. శారదకు కళాశాల ప్రిన్సిపల్ డి.ఆర్.కె. రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డి.ఆర్.కె. రెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి విద్యార్థుల విద్యా ప్రగతికి క్రమశిక్షణకు డాక్టర్ కె. శారద అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె పదోన్నతి సాధించడం కళాశాలకు గర్వకారణమని పేర్కొంటూ ఉన్నత స్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంగా ప్రమోషన్ బదిలీపై ఆర్ఆర్ బీ హెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా బాధ్యతలు స్వీకరించిన సరితకు ప్రిన్సిపల్ డి.ఆర్.కె. రెడ్డి మరియు కళాశాల అధ్యాపక బృందం ఘన స్వాగతం పలికింది. ఆమె విద్యార్థుల విద్యా వికాసానికి విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కె. శారద సేవలను ఆమె సుదీర్ఘ విద్యా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ప్రశంసించారు. అలాగే సరితను కళాశాల కుటుంబంలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ Ch V రమణ కళాశాల ఏజీఎంసీ హుస్సేన్ మొహిద్దీన్ అధ్యాపకులు ఓ. లక్ష్మీనారాయణ రామకృష్ణ నాగేశ్వర్ రెడ్డి అనిలా డి. కాశీ విశ్వనాథం మాధవి చిన్నబ్బాయి రాంబాబు డేనియల్ అరుణ లలిత మేరీతో పాటు కళాశాల ఆఫీస్ ఇంచార్జ్ పల్లా సురేష్ కుమార్  ఇతర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది కె శ్రీనివాసు పాల్గొని డాక్టర్ కె. శారదకు శుభాకాంక్షలు తెలియజేయగా సరితకు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...