గిన్నిస్ రికార్డులో శ్రీకాకుళం యువకుడు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కళింగపట్నానికి చెందిన యువకుడు ప్రభుకుమార్ అరుదైన సాహసం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారులలో ఒకటైన లద్దాఖ్‌లోని ఉమింగ్లా శిఖరాన్ని ద్విచక్ర వాహనంపై అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరాన్ని చేరుకోవడానికి ఈ నెల 5న ప్రారంభించిన సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుకుమార్ సాధనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Comments
Post a Comment